నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సి-డాక్లో టెక్నికల్ పోస్టులు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ :  సి-డాక్లో టెక్నికల్ పోస్టులు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే..!

చెన్నైలోని ది సెంటర్ ఫర్ డెవలప్​మెంట్ ఆఫ్​అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్(సి–డాక్, చెన్నై) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 20. 

పోస్టుల సంఖ్య: 62.
పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్) 25, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎక్స్​పీరియన్స్​డ్) 17, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ 04, ప్రాజెక్ట్ ఆఫీసర్ (మార్కెటింగ్) 01, ప్రాజెక్ట్ టెక్నీషియన్ 15. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్) 39 ఏండ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎక్స్​పీరియన్స్​డ్​) 45 ఏండ్లు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ 40 ఏండ్లు,  ప్రాజెక్ట్ ఆఫీసర్ (మార్కెటింగ్) 50 ఏండ్లు, ప్రాజెక్ట్ టెక్నీషియన్ 30 ఏండ్లు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 05.
లాస్ట్ డేట్: ఆగస్టు 20.  
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.