టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్‌తో చావో రేవో పోరులో రుతురాజ్ మైండ్ గేమ్

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్‌తో చావో రేవో పోరులో రుతురాజ్ మైండ్ గేమ్

CSK vs GT: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ రేసులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ ముగిసింది. కీలకమైన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఈ పిచ్‌పై ఉండే అదనపు పేస్, బౌన్స్‌ను మ్యాచ్ ఆరంభంలోనే సద్వినియోగం చేసుకోవాలనే ప్లాన్‌తోనే బౌలింగ్ తీసుకున్నట్లు సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.  అయితే ఇక్కడ మంచు (Due) ప్రభావం పెద్దగా ఉండదని తెలుస్తుంది. 

చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ ఉండే అవకాశం ఉంది, దానిని పవర్‌ప్లేలోనే క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాం.. జట్టులో రెండు మార్పులు చేశాం.. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు, కానీ ప్రాసెస్‌ను నమ్మి సింపుల్‌గా ఆడుతూ మ్యాచ్‌ను మా వైపు తిప్పుకోవడమే మా టార్గెట్ అని గైక్వాడ్ వెల్లడించాడు. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా లేదు.. టీమ్‌లోకి సాయి కిషోర్ ప్లేస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు.. బాల్‌తో మా ఇంటెన్సిటీని ఇలాగే కొనసాగిస్తామని ఆశిస్తున్నాను.. మా పని ఇంకా పూర్తి కాలేదు.. ఇక్కడి నుంచి మరో మూడు మంచి మ్యాచ్‌లు ఆడటంపైనే మా ఫోకస్ పెట్టామని గిల్ పేర్కొన్నాడు. 

ఇరు జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్