ఏడో విక్టరీతో టాప్ ప్లేస్ కు ముంబై.. ప్లేఆఫ్ నుంచి చెన్నై ఔట్

ఏడో విక్టరీతో టాప్ ప్లేస్ కు ముంబై.. ప్లేఆఫ్ నుంచి చెన్నై ఔట్

చెన్నై ఖల్లాస్​…10 వికెట్ల తేడాతో చిత్తు

చెలరేగిన బౌల్ట్‌‌‌‌, బుమ్రా, ఇషాన్‌‌‌‌

ఏడో విక్టరీతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు ముంబై ఇండియన్స్‌‌‌‌

0, 1, 2, 0.. సీఎస్​కే టాప్‌‌‌‌ ఫోర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ చేసిన రన్స్‌‌‌‌ ఇవి. 3 ఓవర్లలో 3 పరుగులకే 4 వికెట్లు పడ్డ  టైమ్‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌ ధోనీ, జడేజా కూడా ఆదుకోలేకపోయారు. దాంతో 30/6 తో నిలిచిన చెన్నై ఓ దశలో లీగ్‌‌‌‌లో లోయెస్ట్‌‌‌‌ స్కోరు (49) రికార్డును బ్రేక్‌‌‌‌ చేసేలా కనిపించింది. యువ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) అద్భుత పోరాటంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ముంబై ముందు వంద పైచిలుకు స్కోరు ఉంచగలిగింది. అయినా ఏం లాభం..!  బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ పేలవ పెర్ఫామెన్స్‌‌‌‌కు  పోటీ అన్నట్టుగా సీఎస్‌‌‌‌కే బౌలర్లు కూడా తేలిపోయారు..! ఫలితంగా ఐపీఎల్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ పది వికెట్ల తేడాతో ఓడిన ధోనీసేన ప్లేఆఫ్స్‌‌‌‌ ఆశలు వదులుకుంది. మరోవైపు గాయంతో కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ మ్యాచ్‌‌‌‌కు దూరమైనప్పటికీ ముంబై ఇండియన్స్‌‌‌‌ మెస్మరైజ్‌‌‌‌ చేసింది. ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌ (4/18), జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా (2/25) నిప్పులు చెరిగే బౌలింగ్‌‌‌‌కు తోడు  ఓపెనర్లు  ఇషాన్‌‌‌‌ కిషాన్‌‌‌‌ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్‌‌‌‌), క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 నాటౌట్‌‌‌‌) దంచికొట్టారు.! దాంతో, ఏడో విక్టరీతో మళ్లీ టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు వచ్చిన ముంబై  ప్లే ఆఫ్స్‌‌‌‌ బెర్తుకు మరింత చేరువైంది.

షార్జా: గతమెంతో ఘనంగా ఉన్నా.. ఈ సారి ఆరంభం నుంచే తంటాలు పడుతున్న చెన్నై ఐపీఎల్‌‌‌‌ పదమూడో సీజన్‌‌‌‌లో ప్లేఆఫ్స్‌‌‌‌ రేసు నుంచి నిష్ర్కమించింది. గత ఓటముల నుంచి పాఠాలు నేర్వలేకపోగా.. మరింత చెత్త ఆటతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  పది వికెట్ల తేడాతో  ముంబై ఇండియన్స్‌‌‌‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్‌‌‌‌ వైఫల్యంతో తొలుత ఆ జట్టు 20 ఓవర్లలో 114/9 స్కోరు చేసింది. సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. జట్టులో ముగ్గురు డకౌటవగా.. ఆరుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. అనంతరం ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ మెరుపులతో ముంబై 12.2 ఓవర్లలో వికెట్‌‌‌‌ కోల్పోకుండా 116 రన్స్‌‌‌‌ చేసి గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించింది. ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌కు మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది.

బౌల్ట్‌‌‌‌, బుమ్రా బుల్లెట్స్‌‌‌‌.. కరన్‌‌‌‌ కమాల్‌‌‌‌

మూడు మార్పులతో బరిలోకి దిగినా చెన్నై ఆటలో మార్పు రాలేదు సరికదా ఇంకా దిగజారింది.  టాస్​ ఓడి బ్యాటింగ్​కు వచ్చిన ఆ టీమ్​లో కరన్‌‌‌‌ తప్ప ఒక్కరిలో కూడా క్రీజులో నిలవాలని, పోరాడాలన్న తాపత్రయం కనిపించలేదు. నిర్లక్ష్యమైన షాట్లతోనే పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. మరోవైపు పదునైన బంతులతో హడలెత్తించిన పేసర్లు ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా.. పవర్​ ప్లేలోనే ఐదు వికెట్లు తీసి చెన్నైని దెబ్బకొట్టారు. స్వింగ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో చెలరేగిన బౌల్ట్‌‌‌‌. తన మూడు ఓవర్ల స్పెల్‌‌‌‌లో 15 డాట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.  ఓపెనర్‌‌‌‌ రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (0) ఇన్నింగ్స్‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌కే అతనికి  వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ ఓవర్‌‌‌‌ మెయిడిన్‌‌‌‌ అవగా.. సెకండ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌లో అంబటి రాయుడు (2), జగదీశన్ (0)ను వెనక్కుపంపి బుమ్రా డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. ఫామ్‌‌‌‌లో ఉన్న రాయుడు.. లెంగ్‌‌‌‌ స్టంప్‌‌‌‌కు దూరంగా వెళ్తున్న షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను అనవసరంగా ఆడి కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వగా.. ఔట్‌‌‌‌ సైడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌పై పడి ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు వెంటాడిన జగదీశన్‌‌‌‌.. స్లిప్‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌కు చిక్కడంతో బుమ్రా హ్యాట్రిక్‌‌‌‌పై నిలిచాడు. అయితే, ధోనీ (16) అతనికి ఆ చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఇక, తర్వాతి ఓవర్లో బౌల్ట్‌‌‌‌ వేసిన ఓ నార్మల్‌‌‌‌ డెలివరీకి డుప్లెసిస్‌‌‌‌ (1) ఎలాంటి ఫుట్‌‌‌‌వర్క్‌‌‌‌ లేకుండా ఆడి కీపర్​కు చిక్కడంతో చెన్నై 5/4తో దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌లో ధోనీ, జడేజా (7) అనూహ్యంగా ఎదురుదాడికి దిగాడు. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో మహీ రెండు ఫోర్లు కొట్టగా.. జడేజా ఓ బౌండ్రీ రాబట్టాడు. కానీ, ఈ స్ట్రాటజీ వర్కౌట్‌‌‌‌ కాలేదు. బౌల్ట్‌‌‌‌ వేసిన ఆరో ఓవర్లో షాట్‌‌‌‌ ఆడే ప్రయతంలో జడ్డూ.. మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌లో క్రునాల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఆపై,  రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/22) బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్సర్‌‌‌‌ కొట్టిన ధోనీ తర్వాతి బాల్‌‌‌‌కే మరో షాట్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. కాసేపటికే తన తమ్ముడు రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (0) స్టంపౌటవడంతో  సీఎస్‌‌‌‌కే 43/7తో మరింత డీలా పడింది. ఈ టైమ్‌‌‌‌లో యంగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌కు అపద్బాంధవుడయ్యాడు. రాహుల్‌‌‌‌, కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ (1/25) ఓవర్లలో ఒక్కో సిక్సర్‌‌‌‌ కొట్టిన అతను తర్వాత ఒక్కో పరుగు జత చేస్తూ  ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించాడు. టెయిలెండర్లు శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (11), ఇమ్రాన్‌‌‌‌ తాహిర్‌‌‌‌  (13 నాటౌట్‌‌‌‌)నుంచి అతనికి సపోర్ట్‌‌‌‌ లభించింది. స్పిన్నర్లు రాహుల్‌‌‌‌, క్రునాల్‌‌‌‌ (0/16) బౌలింగ్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌, కరన్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 15వ ఓవర్లో ఠాకూర్‌‌‌‌ను కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ ఎనిమిదో వికెట్‌‌‌‌గా ఔట్‌‌‌‌ చేసినా తాహిర్‌‌‌‌ ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. రెండు ఫోర్లు కూడా కొట్టాడు. చివర్లో వేగంగా ఆడిన కరన్‌‌‌‌ విలులైన రన్స్‌‌‌‌ రాబట్టాడు. బౌల్ట్‌‌‌‌ వేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను చివరి బాల్‌‌‌‌కు ఔటయ్యాడు.

ఇషాన్‌‌‌‌, డికాక్‌‌‌‌ ధనాధన్‌‌‌‌  

చిన్న గ్రౌండ్‌‌‌‌లో ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన పిచ్‌‌‌‌పై  చెన్నై తేలిపోయింది.  దాంతో, ముంబై ఓపెనర్లు క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌ నుంచే భారీ షాట్లతో విజృంభించారు.  దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (0/34) వేసిన ఫస్ట్ ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన డికాక్​ తన ఉద్దేశం ఏంటో చెప్పగా..  రోహిత్‌‌‌‌ గైర్హాజరీలో ఓపెనర్‌‌‌‌గా వచ్చిన చాన్స్‌‌‌‌ను ఇషాన్‌‌‌‌ సద్వినియోగం చేసుకున్నాడు. పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ షాట్లతో  చెలరేగాడు. నిర్భయంగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన అతను బౌండ్రీలే లక్ష్యంగా ఆడాడు. హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌  (0/17)వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌.. దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ వేసిన ఐదో ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయాడు.  శార్దుల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (0/26) బౌలింగ్‌‌‌‌లో 4,6 కొట్టిన తర్వాత డికాక్‌‌‌‌ నెమ్మదించగా.. కిషన్‌‌‌‌ మాత్రం మరింత స్పీడు పెంచాడు. స్పిన్నర్లు తాహిర్‌‌‌‌ (0/22), జడేజా (0/15)లను టార్గెట్‌‌‌‌ చేసిన అతను క్లాసిక్‌‌‌‌ షాట్లతో వరుస సిక్సర్లు బాదాడు. స్వీప్‌‌‌‌, స్లాగ్‌‌‌‌ స్వీప్‌‌‌‌, రివర్స్‌‌‌‌ హిట్‌‌‌‌ షాట్స్‌‌‌‌తో అలరించిన కిషన్​ 29 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, పది ఓవర్లలోనే ముంబై 98/0తో నిలవగా.. ఠాకూర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో మళ్లీ జోరు పెంచిన డికాక్‌‌‌‌..అతని ఓవర్లోనే ఫోర్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను ఫినిష్‌‌‌‌ చేశాడు.

చెన్నై: రుతురాజ్‌‌‌‌ (ఎల్బీ) బౌల్ట్‌‌‌‌ 0, డుప్లెసిస్‌‌‌‌ (సి) డికాక్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 1, రాయుడు (సి) డికాక్‌‌‌‌ (బి) బుమ్రా 0, ధోనీ (సి) డికాక్‌‌‌‌ (బి) రాహుల్‌‌‌‌ 16, జడేజా (సి) క్రునాల్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 7, కరన్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 52, దీపక్‌‌‌‌ (స్టంప్డ్‌‌‌‌) డికాక్‌‌‌‌ (బి) రాహుల్‌‌‌‌ 0, శార్దూల్‌‌‌‌ (సి) సూర్యకుమార్‌‌‌‌ (బి) కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ 11, తాహిర్‌‌‌‌ (నాటౌట్) 13;

ఎక్స్‌‌‌‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 114/9;

వికెట్ల పతనం: 1–0, 2–3, 3–3, 4–3, 5–21, 6–30, 7–43, 8–71, 9–114;

బౌలింగ్: బౌల్ట్‌‌‌‌ 4–1–18–4, బుమ్రా 4–0–25–2, క్రునాల్‌‌‌‌ 3–0–16–0, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ 4–0–22–2, కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ 4–0–25–1, పొలార్డ్‌‌‌‌ 1–0–4–0.

ముంబై: డికాక్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 46, ఇషాన్‌‌‌‌ (నాటౌట్) 68; ఎక్స్‌‌‌‌ట్రాలు: 2; మొత్తం: 12.2 ఓవర్లో 116/0; బౌలింగ్‌‌‌‌: దీపక్‌‌‌‌ 4–0–34–0, హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ 2–0–17–0, తాహిర్‌‌‌‌ 3–0–22–0, శార్దూల్‌‌‌‌ 2.2–0–26–0, జడేజా 1–0–15–0.