ఐపీఎల్ లో చెన్నైకి వందో విజయం..రాజస్థాన్ పై విక్టరీ

ఐపీఎల్ లో చెన్నైకి వందో విజయం..రాజస్థాన్ పై విక్టరీ

జైపూర్ : పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న జట్టు ఓవైపు.. అట్టడుగు స్థానం కోసం పోటీపడుతున్న టీమ్‌ మరోవైపు.. సాధారణంగా ఇలాంటి మ్యాచ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టే సులువుగా గెలుస్తుందనుకుంటారు ఎవరైనా.. కానీ ఊహించిందే జరిగితే అది ఐపీఎల్‌ ఎందుకవుతుం ది. అనూహ్య ఫలితాలు వస్తేనే కదా అసలు మజా. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్యసాగిన పోరు కూడా అనూహ్య మలుపులు తిరిగింది. అయితే చివరకు చెన్నై 4 వికెట్ల తేడాతో రాయల్స్‌ను ఓడించి హ్యాట్రిక్‌ విక్టరి నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్‌ చేసింది. స్టోక్స్‌(26 బంతుల్లో ఫోర్‌ తో 28) టాప్‌ స్కో రర్‌ . చెన్నైబౌలర్లలో జడేజా, చహర్‌ , శాం టర్న్‌‌‌‌ తలో 2వికెట్లు పడగొట్టా రు. అంనతరం టార్గెట్‌ఛేజింగ్‌లో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (43బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 58), అంబటిరాయుడు (47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 రన్స్‌ చేసిగెలిచింది.

చెన్నైదీ అదే దారి

ఈజీ టార్గెట్‌ ఛేజింగ్‌ కుదిగిన సూపర్‌ కింగ్స్‌ కూడా రాయల్స్‌ బాటలోనే నడిచింది.తొలి రెండు ఓవర్లలోనే 2 వికెట్లుకోల్పోయి కష్టా ల్లో పడిం ది. ధవల్‌ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ లో వాట్సన్‌ (0)బౌల్డైతే.. ఆదుకుంటా డనుకున్న రైనా (4) అనూహ్యంగా రనౌటయ్యాడు. ఒక్క ఓవర్‌ విరామంవచ్చిందో లేదో ఆ వెంటనే డుప్లెసిస్‌ (7) కూడా వెనుదిరిగాడు. ఉనాద్కట్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కుయత్నించిన ప్లెసిస్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ లో త్రిపాఠికిచిక్కితే మరి కొద్దిసే పటికే స్టోక్స్‌ పట్టిన కళ్లు చెదిరేక్యాచ్‌ కు జాదవ్‌ (1) పెవిలియన్‌ బాట పట్టాడు.దీంతో చెన్నై ఆరు ఓవర్లు ముగిసే సమయానికి24/4తో పీకల్లోతు కష్టా ల్లో పడింది. ఈ దశలో రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ ను నడిపించే బాధ్యత తీసుకున్న కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఒక్కోపరుగు జోడిస్తూ.. స్కోరు బోర్డును కదిలించాడు.ఒక్కసారి కుదురుకున్నా క భారీ షాట్లకు దిగిన ఈ జోడీ చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లింది. విజయానికి 6 ఓవర్లలో 64 రన్స్‌ చేయాల్సిన స్థితిలో.. రాయుడు 6,4తో గేర్‌ మార్చి 41బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 16బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో రాయుడు ఔటయ్యాడు. స్క్వైర్‌ లెగ్‌ లో వెనక్కి పరిగెడుతూ గోపాల్‌ పట్టిన క్యాచ్‌ తో అంబటి ఇన్నింగ్స్‌ కు తెరపడింది. విజయానికి చేరువగా వచ్చాక ధోనీ కూడా ఔటైనా.. జడేజా (4 బంతుల్లోసిక్సర్‌ తో 9 నాటౌట్‌ ), శాం ట్నర్‌ (3 బంతుల్లో సిక్సర్‌ తో 10 నాటౌట్‌ ) చివరి వరకు నిలిచి జట్టునుగెలిపించారు.

ఒకరి వెంట ఒకరు..

ఆరంభంలో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా ఆ జట్టు 151 పరుగులు చేస్తుందని ఊహించిఉండరు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ ఏ దశలోనూ మంచి స్కోరు చేసేలాకనిపించలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన రహానె సేనకు మొదట్లోనే ఎదురుదెబ్బలుతగిలాయి. ఓపెనర్లు రహానె (14), బట్లర్‌ (10బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ తో 23) తొలి వికెట్‌ కు31 రన్స్‌ జోడించి మంచి టచ్‌ లోనే కనిపించినా..ఆ తర్వాత ఇన్నింగ్స్‌ తడబడింది. చహర్‌ వేసినమూడో ఓవర్‌ లో రహానె వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకున్నా చెన్నై రివ్యూకోరి ఫలితం రాబట్టింది. ఆ తర్వాత శార్దుల్‌ బౌలింగ్‌ లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన బట్లర్‌ నాలుగోబంతికి ఎక్స్‌ట్రా కవర్స్‌ లో రాయుడుకు క్యాచ్‌ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్లిద్దరు పెవిలియన్‌చేరిన తరుణంలో ఆచితూచి ఆడాల్సిన శాంసన్‌ అనవసర షాట్‌ తో వికెట్‌ సమర్పించుకున్నా డు.దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ 3 వికెట్లుకోల్పోయి 54 రన్స్‌ చేసింది. ఆ తర్వాత కూడా ఏదశలోనూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడలేదు.త్రిపాఠి (12), స్మి త్‌ (15)ను జడేజా వరుస ఓవర్‌ లలో పెవిలియన్‌ పంపాడు. రెండు ఫోర్లు కొట్టి నపరాగ్‌ .. శార్దుల్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. 9వఓవర్‌ లోనే క్రీజులోకొచ్ చిన స్టోక్స్‌ పది ఓవర్ల పాటుక్రీజులో నిలిచినా..ఆశించినంత స్పీడ్‌ గా ఆడలేకపోయాడు. పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ ఈ ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ చహర్‌ బౌలిం గ్‌ లో క్లీన్‌బౌల్డయ్ యాడు. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ (7 బంతుల్లో2 ఫోర్లు, సిక్సర్‌ తో 19 నాటౌట్‌ ), ఆర్చర్‌ (13నాటౌట్‌ ) కాస్త బ్యాట్‌ కు పనిచెప్పడంతో రాయల్స్‌గౌరవప్రద స్కోరు చేయ గలిగింది.

స్కోర్ వివరాలు

రాజస్థా న్‌‌‌‌‌‌‌‌: రహానె (ఎల్బీ) చహర్‌ 14, బట్లర్‌ (సి)రాయుడు (బి) శార్దుల్‌ 23, శాం సన్‌ (సి) (సబ్‌ )ధ్రువ్‌ (బి)శాం ట్నర్‌ 6, స్మి త్‌ (సి) రాయుడు (బి)జడేజా 15, త్రిపాఠి (సి) జాదవ్‌ (బి) జడేజా 10,స్టోక్ స్‌ (బి) చహర్‌ 28, పరాగ్‌ (సి) ధోనీ (బి) శార్దుల్‌16, ఆర్చర్‌ (నాటౌట్‌ ) 13, గోపాల్‌ (నాటౌట్‌ ) 19;ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 151/7;వికెట్ల పతనం: 1–31, 2–47, 3–53, 4–69, 5–78,6–103, 7–126; బౌలిం గ్‌ : చహర్‌ 4–0–33–2, శాం ట్నర్‌ 4–0–25–1, శార్దుల్‌ 4–0–44–2, జడేజా4–0–20–2, తాహిర్‌ 4–0–28–0.

చెన్నై: వాట్సన్‌ (బి) కులకర్ణి 0, డుప్లెసి స్‌ (సి) త్రిపాఠి(బి) ఉనాద్కట్‌ 7, రైనా (రనౌట్‌ /ఆర్చర్‌ ) 4,
రాయుడు (సి) గోపాల్‌ (బి) స్టోక్ స్‌ 57 , జాధవ్‌ (సి)స్టోక్ స్‌ (బి) ఆర్చర్‌ 1, ధోనీ (బి) స్టోక్ స్‌ 58, జడేజా
(నాటౌట్​) 9, శాం ట్నర్‌ (నాటౌట్​)10; ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు:9; మొత్తం: 20 ఓవర్లలో 155/6;

వికెట్ల పతనం:1–0, 2–5, 3–15, 4–24, 5–119, 6–144.;బౌలిం గ్‌ : కులకర్ణి 3-–1–14–1, ఉనాద్క-
ట్‌ 3–0–23–1 , ఆర్చర్‌ 4–1–19–1 , పరాగ్‌3–0–24–0, గోపాల్‌ 4–0–31–0, స్టోక్ స్‌ 3–0–39–2.