
కాకా వెంకటస్వామి చదివింది పదోతరగతి అయినా ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడేవారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వివే హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో లా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఫ్యాకల్టీ విజయలక్ష్మి, అంబేద్కర్ కాలేజ్ చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,కాలేజీ కరస్పాండెంట్ సరోజ వివేక్, హ్యూమన్ రైట్స్ కమిషనర్ విద్యాధర బట్టు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. స్టూడెంట్స్ రోజూ రీడింగ్ అలవాటు పెట్టుకుంటే బాగుంటదన్నారు. ప్రతీ అంశంలో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. అంబేద్కర్ కాలేజీలో లా విద్యను అభ్యసించిన వారు సమాజంలో గొప్ప లాయర్లుగా ఉన్నారని చెప్పారు. స్టూడెంట్స్ కాలేజీకి రెగ్యులర్ గా రావాలన్నారు.
Also Read : నిజాం గ్రౌండ్స్ లో అయోధ్య ప్రత్యక్షప్రసారం
కాకా విజన్ కోసం అంబేద్కర్ కాలేజీ పనిచేస్తుంది: సరోజ వివేక్
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆనాడు కాకా అంబేద్కర్ కాలేజీని స్థాపించారని కాలేజ్ కరస్పాండెంట్ సరోజ వివేక్ అన్నారు. అంబేద్కర్ కాలేజీలో గొప్ప ఫ్యాకల్టీ ఉందని చెప్పారు. స్టూడెంట్స్ కి అటెండెన్స్ ఎంతో ముఖ్యమన్నారు. 80 శాతం అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కు మేనేజ్మెంట్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుందన్నారు. స్టూడెంట్ వందలో తానొక్కడినని కాకుండా.. కాలేజీ టాప్ ర్యాంక్ కోసం కష్టపడి చదవాలన్నారు.