నిజాం గ్రౌండ్స్ లో అయోధ్య ప్రత్యక్షప్రసారం

నిజాం గ్రౌండ్స్ లో అయోధ్య ప్రత్యక్షప్రసారం

అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠాపనకోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.  సోమవారం ( జవనరి 22) 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష నెరవేరబోతోందనన్నారు ఎంపీ లక్ష్మణ్.  నిజాం గ్రౌండ్స్ లో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన 1526 వ సంవత్సరంలో బాబర్ రామ మందిరాన్ని నేల మట్టం చేసారని... అప్పుడు లక్నో కోర్టులో విచారణ కోసం  574 పేజీల నివేదికను తయారు చేసినట్లు తెలిపారు. 

రామజన్మభూమి అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమంలో నిష్ఠగా పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష చేస్తుంటే ఈ అంశాన్ని  కాంగ్రెస్  పార్టీ రాజకీయం చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా హిందువుల మనోభావాలతో ఆడుకోవడం... మైనార్టీలకు వత్తాసు పలకడం ఆ పార్టీ నైజమన్నారు.  అయోధ్యలో సోమవారం (జనవరి22) జరిగే మహోత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనే  అవకాశం లేనందు నిజాం గ్రౌండ్స్ లో ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయోధ్యలో జరిగే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తెలిపారు.  ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , తదితరులు పాల్గొంటారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.

Also Read :  అయోధ్యను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీ డబ్బులు మాయం