- చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి
జైపూర్(భీమారం), వెలుగు : భీమారం మండలంలోని మద్దికల్‌లో గ్రామస్తులు నిర్వహిస్తున్న చిరుతల రామాయణం పట్టాభిషేక మహోత్సవానికి ఆదివారం సాయంత్రం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి ఆశీస్సులతో కేసీఆర్ రాక్షస పాలనను హంతం చేశామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీ కృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షడు మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన మల్లన్న స్వామి బోనాల వేడుకల్లోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.