కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​ అగ్రనేత.. కాకా వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. బాగ్​ లింగంపల్లి అంబేద్కర్​ విద్యా సంస్థల్లో జరిగిన వేడుకల్లో ఆయన కుమారుడు.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ... పేదలకు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల చైర్మన్​ సరోజ వివేక్​...  కాకా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.   కాకా ఆశీర్వాదంతో అంబేద్కర్​ కాలేజీని.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు.  50 ఏళ్లుగా  లక్షన్నర మంది పేద విద్యార్థులకు విద్యనందించామన్నారు.

 

అంబేద్కర్​ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని... ఆ మహనీయుని అడుగు జాడల్లో నడుస్తూ.. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశంతో అంబేద్కర్​ విద్యా సంస్థలు స్థాపించామన్నారు.  పేదలకు విద్యనందించేందుకు అంబేద్కర్​ విద్యాసంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. యూనివర్శిటీ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. తమ సంస్థలకు న్యాక్​ గుర్తింపు వచ్చిందన్నారు.  అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ,ప్రతి ఒక్కరికీ విద్య అందించే విధంగా.. కాక అంబేద్కర్ విద్య సంస్థలు స్థాపించారన్నారు. కాకా చేసిన సేవలను.. మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకా విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ కుమార్​  పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.