కామ్రేడ్​ గట్టయ్యను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కామ్రేడ్​ గట్టయ్యను పరామర్శించిన చెన్నూరు  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ కొండాపూర్​లోని సీఆర్ ​ఫౌండేషన్ హోమ్ లో ఉంటున్న సింగరేణి కార్మిక సంఘ నేత, సీపీఐ లీడర్ ​కామ్రేడ్​గట్టయ్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి సోమవారం పరామర్శించారు.  ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ​ఫౌండేషన్​ సేవలు బాగున్నాయని, సీనియర్​ సిటిజన్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలతో అందిస్తున్నారని  వివేక్​వెంకటస్వామి అభినందనలు తెలిపారు.