చెన్నూరులో పత్తి కొనుగోళ్లు పెంచాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో పత్తి కొనుగోళ్లు పెంచాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో రైతులు పండించిన పత్తి పంటను.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. సీసీఐ కొనుగోలు చేయాలని అసెంబ్లీలో ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయని.. దీని వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అవుతుందన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ వేగంగా చేయాలని.. ప్రతి రోజూ 200 లారీలతో వెంటనే కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

పత్తి పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్ కు వచ్చిందని.. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ.. సీసీఐని ఆదేశించాలని సభలో కోరారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ప్రశ్నలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే డిమాండ్లను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపించి.. సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Also read :    రిసార్టులో పెళ్లి విందు.. గుండెపోటుతో RMP డాక్టర్ మృతి