ఉత్తరాదిన కుండపోత వాన..చిరపుంజిలో 634 మి.మీ వర్షపాతం

ఉత్తరాదిన కుండపోత వాన..చిరపుంజిలో 634 మి.మీ వర్షపాతం

మేఘాలయ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుండ పోత వర్షాలు పడుతున్నాయి. చిరపుంజిలోని భారీ వర్షపాతం నమోదు అయింది. బలమైన ఈదురుగాలులతో వర్షం పడుతుందని చిరపుంజిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

గత 24 గంటల్లో 634మి.మీ. వర్షపాతం, గత 72 గంటల్లో మొత్తం 1202మి.మీ వర్షపాత నమోదు అయింది. మరోవైపు సిల్చార్ లో 387 మి.మీలు, హాఫ్లాంగ్ లో 386 మి.మీల వర్షపాతం నమోదైంది. 

చిరపుంజిల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 26 సెకనుల ఈ వీడియోలో మేఘాలయలోని చిరపుంజిలో బలమైన గాలులు, కుండపోత వర్షం, నీటమునిగిన కాలనీలను చూపెడుతుంది.