కేటీఆర్ స్కామ్స్ ఇంకా చాలా పెద్దవి ఉన్నయ్: కొండా విశ్వేశ్వర్రెడ్డి
వికారాబాద్, వెలుగు: గుండెకు ఆపరేషన్ జరిగి తాను ఆస్పత్రిలో ఉంటే.. తన చావును కోరుకుంటూ బీసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులు పోస్టులు పెట్టారని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. ఎవరైనా సోషల్ మీడియాలో ‘నువ్వు చావు’ అని పోస్టులు, కామెంట్లు పెడతారా? అని మండిపడ్డారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్‌లో జరిగిన యూనిటీ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తాను చావాలని కోరుతూ కామెంట్లు పెట్టడం చాలా బాధకు గురిచేసిందన్నారు. ఈ కార్ రేసు చిన్న అవినీతి మాత్రమేనని.. కేటీఆర్ స్కామ్ లు ఇంకా చాలా పెద్దపెద్దవి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని విచారించాలని కోరారు.
