చేవెళ్ల: కుటుంబాన్ని కబళించిన లారీ..బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి ఢీ

చేవెళ్ల: కుటుంబాన్ని కబళించిన లారీ..బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి ఢీ
  •     భార్యాభర్తలు, కొడుకు కన్నుమూత
  •     ప్రాణాలతో బయటపడ్డ కూతురు 

చేవెళ్ల, వెలుగు : ఓ కుటుంబం బైక్​పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలతో పాటు వారి ఆరేండ్ల కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. కూతురు గాయాలతో బయటపడింది. స్థానికుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(36), ఆయన భార్య సావిత్రి (30), ఆరేండ్ల కొడుకు ధనుష్​,  తొమ్మిదేండ్ల కూతురు బైక్​పై చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. 

చీకటి పడ్డాక  తిరిగి వస్తుండగా చేవెళ్ల మండలం గొల్లపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు, సావిత్రి, ధనుష్​ తీవ్రంగా గాయపడి  అక్కడికక్కడే చనిపోయారు. పాప గాయపడడంతో చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.