సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఛత్తీస్ గఢ్ సీఎం

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  ఛత్తీస్ గఢ్ సీఎం

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాయ్ పూర్ లో ఛత్తీస్ గఢ్ సీఎంతో భేటీ సందర్భంగా  సమ్కక్క సాగర్ కు ఎన్ వోసీ జారీ చేయాలని ఉత్తమ్ కోరారు.  ఛత్తీస్ గఢ్లో ముంపునకు గురయ్య ప్రాంతాలకు , పరిహారం ,పునరావాస బాధ్యత తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు. ఛత్తీస్ గఢ్ సీఎం ఎదుట ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు  .  దీంతో  తెలంగాణ ప్రతిపాదనకు  సానుకూలంగా స్పందించిన సీఎం విష్ణుదేవ్ సాయికి కృతజ్ఞతలు తెలిపారు  మంత్రి ఉత్తమ్ . 

దేవాదుల ఆయకట్టును స్థిరీకరించే ఉద్దేశ్యంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద 6.94 టీఎంసీల కెపాసిటీతో సమ్మక్క బ్యారేజీని నిర్మించారు. దీని వల్ల ఛత్తీస్ గఢ్ లోని కొంత ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఈ మేరకు  ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ ఓసీపై చర్చించేందుకు సమయం కావాలని  ఇటీవల ఉత్తమ్ ఛత్తీస్ గఢ్ సీఎంకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఇవాళ  చత్తీస్ ఘడ్ సీఎంతో సమావేశమైన ఉత్తమ్  ముంపు ప్రాంతాలకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని చెప్పారు. దీంతో సీఎం ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.