
హైదరాబాద్,వెలుగు: జంట నగరాల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల కిందట కిలోకు రూ. 150 ఉంది. ప్రస్తుతం కిలోకు రూ. 240 నుంచి రూ. 260 పెరిగిపోయాయి. కార్తీక మాసం కారణంగా నెలరోజుల పాటు నాన్వెజ్తినే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో చికెన్ ధరలు తగ్గాయి. కార్తీక మాసం అయిపోవడంతో మళ్లీ ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మటన్ ధర కంటే చికెన్ధర తక్కువగా ఉంటుండగా ఎక్కువమంది తినేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు.
దీంతో డిమాండ్ కూడాపెరుగుతుండగా మళ్లీ ధరలు కూడా పెంచేశారు. వింటర్ లో చాలా మంది నాన్వెజ్ ప్రియులు చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. దీని కారణంగానే ధరలు కూడా పెంచేసినట్టు తెలుస్తుంది. జంటనగరాల్లో సాధారణ రోజుల్లో రోజుకు 1.25 లక్షల నుంచి 1.5 లక్షల చికెన్ వాడకం అవుతుంది. పండగలు, సెలవు రోజుల్లో దాదాపు 2 లక్షల కేజీలు అమ్ముడుపోతున్నట్టు చికెన్ వ్యాపారులు తెలిపారు.