చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

 చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్. గతవారం వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గాయి. ఆదివారం వస్తే చాలు చాలా మంది నాన్ వేజ్ కావాల్సిందే.  అలాంటి వారికి ఇది నిజంగా శుభావార్తేనని చెప్పాలి.   ఏపీ, తెలంగాణలో కేజీ చికెన్ ధర స్కిన్‌లెస్ రూ.200 నుంచి రూ.210 ఉంది.  ఇదే  వారం కిందట ఇది రూ.280 నుంచి రూ.310 వరకు పలికింది. ప్రస్తుతం విత్ స్కిన్ అయితే రూ.200లోపే లభిస్తోంది. 

ఇరు రాష్ట్రాల్లో కోళ్ల లభ్యత పెరగడమే ధర తగ్గుదలకు కారణమని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. కార్తీక మాసం వేళ అమ్మకాలు పెద్దగా ఉండే అకకాశం లేదని వ్యాపారులు అంటున్నారు. కార్తీక మాసం తర్వాత మళ్లీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

అయితే కోళ్ల రేటు, చికెన్ ధర అనేవి షాప్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. అందు వల్ల మీరు మీ దగ్గరిలోని చికెన్ సెంటర్‌కు వెళ్లి ఎంత రేటు ఉందో తెలుసుకోండి. ఒక షాపులో ఒక రేటు, మరో షాపులో మరో రేటు ఉండే అవకాశం ఉంటుంది.