సాయిచంద్‌ మృతిపట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

సాయిచంద్‌ మృతిపట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమ గాయకుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సాయిచంద్ మరణం పట్ల సంతాపాన్నిప్రకటించారు. చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని  అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. శోకతప్త హృదయులైన  సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.