
హైదరాబాద్ : కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. పద్మ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోంమంత్రిని అడిగామని చెప్పారు. ఆరేళ్లుగా ఎయిర్ స్టిప్స్ కావాలని అడిగినా అనుమతించలేదన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, జలపాతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు కేసీఆర్.