కేసీఆర్ ప్రసంగంలో ఆ పాయింట్ మిస్

కేసీఆర్ ప్రసంగంలో  ఆ పాయింట్ మిస్

76వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ గోల్కొండపై  త్రివర్ణపతాకాన్నిఎగరేశారు.  దాదాపు 42 నిమిషాల పాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒక్క మాట కూడా కాళేశ్వరం గురించి లేదు.  గతంలో ఎన్నో సందర్భాల్లో.. ఎన్నో వేదికలపై సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు  కాళేశ్వరం గురించి  గొప్పలు చెప్పుకునేవారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, అప్పులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా ఉపన్యసించారు. కేంద్రంపైన విమర్శలు సైతం చేశారు.

గతంలో పలు వేదికలపై అద్భుతమని చెప్పిన కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గోల్కండ వేదికపై ప్రస్తావించలేదు. ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ నిర్మాణంగా రాష్ట్రప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది.  లక్ష కోట్ల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం.. ఇటీవల గోదావరి వరదల్లో జులై 14న అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌజులు నీటమునిగాయి.