
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయన సర్వీస్ మరో ఐదు నెలలు ఉండగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లలోని ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఎల్వీ సుబ్రహ్మణ్యం కు మధ్య ఓ బిజినెస్ మార్పిడి విషయంలో వివాదం జరిగింది. ఈ విషయంపై గత నెల 31న సీఎస్ ఆఫీస్ నుంచి ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ అయ్యాయి. మరో రెండు రోజుల్లో ఆ నోటీసులపై ప్రవీణ్.. వివరణ ఇవ్వాల్సి ఉండగా.. సుబ్రహ్మణ్యం ట్రాన్సఫర్ కావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ప్రవీణ్ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నిరభ్ కుమార్ ని నియమించింది.