గోల్కొండ కోట‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

గోల్కొండ కోట‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

హైదరాబాద్ : గోల్కొండ కోట‌లో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్ ప‌రిశీలించారు. పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, ఐ&పీఆర్‌, సాంస్కృతిక‌, రెవెన్యూ శాఖ‌ల అధికారుల‌తో వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ స‌మీక్ష చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. 

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సోమేశ్ కుమార్ వెంట నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్,స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఉన్నారు.