
ఆర్చరీ అనే క్రీడ గురించి రెండవ తరగతిలోనే తన తండ్రి తనకు చెప్పాడని.. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లు బంగారు పతక విజేత తానిపర్తి చికిత అన్నారు. కెనడాలో విన్నిపెగ్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో అండర్ 21 మహిళా విభాగంలో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. బంగారు పథకంతో ఇవాళ (ఆగస్టు 28) స్వస్థలానికి చేరుకున్న చికిత.. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
తన తండ్రి స్పోర్ట్స్ పర్సన్ కావాలని కలలు కన్నాడని.. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన కాలేకపోయాడని తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించి తన తండ్రి కోరిక తీర్చినట్లు చెప్పారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం అని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకు సాగినట్లు చెప్పారు. మొదట జిల్లా కలెక్టర్ సపోర్టు చేశారని తెలిపారు.
టోర్నమెంటులో పాల్గొనే క్రమంలో చాలా ఇబ్బందులకు గరైనట్లు తెలిపారు. ఫ్లైట్ టికెట్స్ కాన్సిల్ అయ్యాయని.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టికెట్స్ బుక్ చేయకుంటే టోర్నమెంటులో పాల్గొనే వాళ్లం కాదని చెప్పారు. టోర్నమెంట్ ముందు చాలా అలసిపోవడంతో.. బాగా నిద్ర వచ్చిందనీ.. ఎలా గెలిచానో కూడా తెలియదని అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యకం చేశారు. భారతదేశానికి , తెలంగాణ రాష్టానికి పతకాలు సాధించి గౌరవం తెస్తానని చెప్పపారు.
అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాను: చికిత తండ్రి
తన కూతురును పెద్ద క్రీడాకారిణిని చేసేందుకు ఎంతో శ్రమించినట్లు చికిత తండ్రి తానిపర్తి శ్రీనివాస్ రావు తెలిపారు. అప్పులు చేసి ప్రోత్సహించానని.. నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పారు. తనకు
నాకు ఎలాంటి స్పోర్ట్స్ కార్యాలయాలు తెలియనప్పటికీ.. తన కూతురు స్వతహాగా ఈ స్థాయికి వచ్చిందని ఆనందించారు.
►ALSO READ | Asia Cup 2025: అసలంకకు కెప్టెన్సీ.. ఆసియా కప్‌కు శ్రీలంక స్క్వాడ్ ప్రకటన
గతంలో కలెక్టర్ లు గా పని చేసిన సంగీత సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, దేవసేన, కోయ శ్రీహర్ష కొంచెం సహకరించారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తండ్రిగా తన కూతురు సాధించిన విజయానికి గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. రాబోయే ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం సహకరించాలని కోరారు.