Asia Cup 2025: అసలంకకు కెప్టెన్సీ.. ఆసియా కప్‌కు శ్రీలంక స్క్వాడ్ ప్రకటన

Asia Cup 2025: అసలంకకు కెప్టెన్సీ.. ఆసియా కప్‌కు శ్రీలంక స్క్వాడ్ ప్రకటన

సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కు శ్రీలంక స్క్వాడ్ వచ్చేసింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్  గురువారం (ఆగస్టు 28) ప్రకటించింది. శ్రీలంక జట్టుకు చరిత్ అసలంకను కెప్టెన్ గా ఎంపిక చేశారు. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా ఈ కాంటినెంటల్ టోర్నీకి స్థానం సంపాదించాడు. హసరంగా గ్రూప్ మ్యాచ్ లు ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్న ఈ లంక స్పిన్నర్ సూపర్ 4 మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.   

చమిక కరుణరత్నే, కమిల్ మిషారా, నువానిడు ఫెర్నాండో స్క్వాడ్ లో స్థానం సంపాదించారు. మిడిల్ ఆర్డర్ లో జట్టుకు వీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లు దుష్మంత చమీర, నువాన్ తుషార, మథీష పతిరాన రూపంలో బలంగా కనిపిస్తుంది. మహీష్ తీక్షణ, హసరంగా, దునిత్ వెల్లలేజ్ తమ స్పిన్ తో ప్రత్యర్థిని తిప్పేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఛాన్స్ దక్కింది.ఆసియా కప్ కు ముందు శ్రీలంక జింబాబ్వేతో సెప్టెంబర్ 3 నుంచు మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 

►ALSO READ | BWF World Championship: క్వార్టర్ ఫైనల్స్‌‌కు దూసుకెళ్లిన సింధు.. ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 చిత్తు

ఆసియా కప్ లో శ్రీలంక గ్రూప్ బి ఉంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఇదే గ్రూప్ లో ఉన్నాయి. లంక సూపర్ 4 కు అర్హత సాధించాలంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. 

ఆసియా కప్ 2025 కోసం శ్రీలంక జట్టు:

చరిత్ అసలంక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సంక, కుసల్ పెరెరా , కమిల్ మిషార, దసున్ షనక , కమిందు మెండిస్, వనిందు హసరంగా, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, డి నుష్‌ తీక్షణ, మతీష తీక్షణ, మతీషా చతీరమే ఫెర్నాండో