
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోంది. ప్రపంచ నంబర్ 2 వాంగ్ ఝీ యిని వరుస గేమ్‌లలో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 2021 తర్వాత ఈ టోర్నమెంట్ లో సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏడాది కాలంగా ఫామ్ కోసం ఇబ్బందిపడుతున్న ఈ తెలుగు నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎట్టకేలకు తన ఫామ్ అందుకుంది. గురువారం (ఆగస్టు 28) నంబర్ 2 వాంగ్ ఝీ యినితో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 21-17, 21-15 తేడాతో ఘన విజయం సాధించింది.
క్వార్టర్ ఫైనల్ కు ముందు కఠిన ప్రత్యర్థి కళ్ళ ముందు కనిపిస్తున్నా బెదరలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి గేమ్ ను 21-17 తో గెలుచుకుంది. రెండో సెట్ లో కీలక సమయంలో సింధు పదునైన సర్వీసులకు వాంగ్ ఝీ వద్ద సమాధానమే లేకుండా పోయింది. 30 ఏళ్ల సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరుకునే క్రమంలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్ మ్యాచ్ లతో పాటు.. నేడు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అలవోక విజయాలను అందుకుంది. క్వార్టర్ ఫైనల్ లో సింధు ఇండోనేషియాకు చెందిన వరల్డ్ తొమ్మిదో ర్యాంకర్ పుత్రి కుసుమ వార్దానీతో తలపడనుంది.
►ALSO READ | Lockie Ferguson: లాకీ ఫెర్గూసన్ ఆల్ టైమ్ టాప్-5 టెస్ట్ బౌలర్లు వీరే.. టీమిండియా పేసర్లకు నో ఛాన్స్
వార్దానీ విషయానికొస్తే.. 2025లో ఈ యువ ప్లేయర్ టాప్ ఫామ్ లో ఉంది. 27 మ్యాచ్ ల్లో గెలిచి 12 ఓడిపోయింది. మరోవైపు 2025లో సింధు రికార్డ్ బాగాలేదు. తొమ్మిది విజయాలు సాధించి 12 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో చూపించిన జోరునే సెమీ ఫైనల్లో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
SHE NEVER STOPPED BELIEVING!!! 🏸 👑
— ESPN India (@ESPNIndia) August 28, 2025
PV Sindhu knocks out World No. 2 Wang Zhi Yi to reach the BWF World Championships quarter-finals 🇮🇳 💪 pic.twitter.com/cqFLyM5wwv