ముంబై: అండర్-19 వరల్డ్ కప్‌లో ఆరోసారి విజేతగా నిలిచిన యంగ్ ఇండియా టీమ్ ఆదివారం స్వదేశానికి చేరుకుంది. ముంబై ఎయిర్‌పోర్టులో ప్లేయర్ల కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు యువ హీరోలకు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం జింబాబ్వేలోని హరారేలో జరిగిన తుది పోరులో ఆయుష్ మాత్రే కెప్టెన్సీలోని ఇండియా వంద రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ట్రోఫీ నెగ్గింది.
మాత్రే పేరెంట్స్‌తో పాటు అతని మొత్తం ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి గ్రాండ్ వెల్‌కం చెప్పింది. కాగా, ఈ టోర్నీ సెమీస్‌లో సెంచరీతో సత్తా చాటిన హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ స్వాగతం పలికారు. యంగ్ ఇండియాకు రూ. 7.5 కోట్ల రివార్డు ప్రకటించిన బీసీసీఐ బీసీసీఐ క్రికెటర్లకు తొందర్లోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది.
