దసరా బరిలో విశ్వంభర..! అక్టోబర్ 16న విడుదల..!

దసరా బరిలో విశ్వంభర..! అక్టోబర్ 16న విడుదల..!

చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'విశ్వంభర', త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. 

తాజాగా ఈ వర్క్ తుది దశలో ఉందని, దీంతో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రైమేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దసరా సీజన్ టార్గెట్గా.. పండుగ సెలవులు కలిసొచ్చేలా అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోం ది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

కునాల్ కపూర్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా. సురభి. రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అంది స్తున్నారు. మరోవైపు దసరా బరిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' కూడా రాబోతుండటంతో వీరిమధ్య బాక్సాఫీస్ క్లాష్ ఖాయమనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. వీటిపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.