రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేసిండు : చికోటి ప్రవీణ్‌

రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేసిండు  :  చికోటి ప్రవీణ్‌

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌.  బీఆర్ఎస్ పెద్దల అండతో రాధాకిషన్‌రావు అరాచకాలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని ఆరోపించారు.  తనపై పీడీ యాక్టు కేసులు పెడతానని రాధాకిషన్‌రావు బెదిరించినసట్లుగా  చికోటి ప్రవీణ్‌ తన ఫిర్యాదులో తెలిపారు.  రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. 

రాధకిషన్ రావు కు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు చికోటి ప్రవీణ్‌. రాధకిషన్ రావు ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయించాలని ఆయన  డిమాండ్ చేశారు.  సినిమా హీరోయిన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు చికోటి .  దీనిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని...  విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని   తెలిపారు. రాధకిషన్ రావు బాధితులంతా బయటకి రావాలని చికోటి పిలుపునిచ్చారు.  

మరోవైపు  ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్​ఎస్​ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఎన్నికలొచ్చినా గులాబీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పనిచేసినట్టు తేటతెల్లమైంది. ఎలక్షన్​ టైంలో  ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం, దాన్ని హవాలా డబ్బుగా చూపెట్టడం.. బీఆర్‌‌‌‌ఎస్‌‌  పైసలైతే టాస్క్​ఫోర్స్​ వెహికల్స్​లో అభ్యర్థులకు చేరవేయడం వంటివి చేపట్టారని టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు రిమాండ్​ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. 

ALSO READ :- IPL 2024: ఇదేదో బాగుందే.. రూల్స్ అతిక్రమించిన ఇషాన్ కిషన్‌కు వెరైటీ శిక్ష