IPL 2024: ఇదేదో బాగుందే.. రూల్స్ అతిక్రమించిన ఇషాన్ కిషన్‌కు వెరైటీ శిక్ష

IPL 2024: ఇదేదో బాగుందే.. రూల్స్ అతిక్రమించిన ఇషాన్ కిషన్‌కు వెరైటీ శిక్ష

టీమ్ నిబంధనలు ఉల్లంఘించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మేనేజ్మెంట్ వెరైటీ శిక్ష విధించింది. రోజంతా సూపర్ హీరో జంప్‌సూట్‌ ధరించాల్సిందిగా ఆదేశించింది. దాంతో కిషన్ ఒంటిపై ఆ దుస్తులు ధరించే చక్కర్లు కొట్టాడు. కిషన్ ఫన్నీ సూపర్ హీరో సూట్‌‌లో ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిషన్‌ గతంలో కూడా ఇలాంటి శిక్షను ఎదుర్కొన్నాడు. రూల్స్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్లు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. ప్రాక్టీస్‌కు ఆలస్యంగా రావడం లేదా హోటళ్లలో కాల్ సమయాలను పాటించకపోవడం వంటి నిబంధనల్లో ఆటగాళ్లను క్రమశిక్షణలో ఉంచడానికి వెరైటీ శిక్షలు విధిస్తుంటాయి. ప్రతి సీజన్‌లో ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేసి రూల్స్ అతిక్రమించిన ఆటగాడు రోజంతా దాన్ని ధరించేలా చేస్తారు.

అట్టడుగున ముంబై

ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియ‌న్స్.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎవరికి వారు అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

ముంబై ఇండియ‌న్స్ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా జరగనుంది.

ALSO READ | T20 World Cup 2024: ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్