
సోషల్ మీడియాలో వీడియో వైరల్
పోలీసులకు నెటిజన్ల కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఇద్దరు యువతీ యువకులు ఓ చిన్నారితో కలిసి పబ్‌కి వచ్చారు. అంతా డీజే సౌండ్స్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. చిన్నారి కూడా డ్యాన్స్ చేసింది. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పబ్‌లో చిన్నారి డ్యాన్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. పబ్‌లోకి చిన్నారిని అనుమతించడమేంటని ప్రశ్నించారు. దీంతో రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించిన పబ్ నిర్వాహకులకు గచ్చిబౌలి పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. పబ్‌లోని సీసీటీవీ పుటేజ్ కలెక్ట్ చేశారు. చిన్నారిని తీసుకొచ్చిన వారి వివరాలు సేకరించారు.