లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఇరుక్కుని చిన్నారి మృతి

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఇరుక్కుని చిన్నారి మృతి

హైదరాబాద్, వెలుగు: ఆడుకుంటూ లిఫ్ట్ ఎక్కేందుకు వెళ్లిన ఓ చిన్నారి అనుకోకుండా అందులో ఇరుక్కుని కన్నుమూసింది. హైదరాబాద్‌ ఎల్ బీ నగర్ పిండి పుల్లారెడ్డి కాలనీలో ఈ విషాదం జరిగింది. నాగలక్ష్మి, చంద్రశేఖర్ లకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు లాస్య(8) నాదర్ గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. ప్రభుత్వ సెలవుల నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉంటున్న లాస్య శుక్రవారం గ్రౌండ్ ఫ్లోర్ లో ఆడుకున్నది. కొంతసేపటి తర్వాత పైకి వెళ్లేందుకని లిఫ్ట్ వద్దకు పోయింది. లిఫ్ట్ లోకి ఎక్కకముందే అది పైకి కదిలింది. దీంతో లాస్య లిఫ్ట్ డోర్ వద్ద ఇరుక్కుపోయింది. పాపను లిఫ్ట్ మూడో అంతస్తు వరకు లాక్కెళ్లింది. లిఫ్ట్ లో నుంచి ఆ చిన్నారిని తీసేందుకు చాలా సమయం పట్టడంతో తల్లడిల్లిపోయింది. బయటకు తీశాక తల్లిదండ్రులు ఎల్బీ నగర్ లోని గ్లోబల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే పాప చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. తమ కళ్లముందే బిడ్డ కన్నుమూయడం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు పెద్దపెట్టున రోదించారు.