V6 News

ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్..విద్యాశాఖ, న్యాయ సేవా సంస్థ కీలక నిర్ణయం

ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్..విద్యాశాఖ, న్యాయ సేవా సంస్థ కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఒక ‘చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్’ ఉండబోతున్నారు. స్కూల్ టీచర్లలో ఒకరిని ఎంపిక చేసి.. విద్యార్థుల హక్కుల రక్షణ, వేధింపుల నిరోధానికి వారిని బాధ్యులను చేయనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోశి సమక్షంలో విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి సంతకాలు చేశారు. 

ఈ కొత్త విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,711 హైస్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇందులో 194 మోడల్ స్కూళ్లు, 4,704 ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 35 సొసైటీ గురుకులాలు, 33 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 250 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. ప్రతి చోటా ఒక టీచర్‌‌‌‌‌‌‌‌ను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నియమించి.. వారికి చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.