
కొంతమంది పిల్లలు ఏ పని కూడా సీరియస్ గా తీసుకోరు. టైంలోగా పూర్తి చేయరు. వాళ్లు అలా చేయడానికి కారణం.. మోటివేట్ చేసేవాళ్లు లేకపోవడం, సెల్ఫ్ డిసిప్లీన్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం, బోర్ ఫీలవ్వడం. ఇలా అనేక రకాల కారణాలవల్ల పిల్లలు చేయాల్సిన పనిని వాయిదావేస్తుంటారు. అలా వేయకుండా ఉండాలంటే పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .
- చెప్పిన పని ఎందుకు చేయడం లేదు?' అని పిల్లల్ని అడగాలి. దానికి పిల్లలు ఏం చెబుతారో విని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ సమస్యకి సొల్యూషన్ చెప్పాలి. టైంకి పనులు చేయడం ఎంత ముఖ్యమో వివరంగా చెప్పాలి.
- ఏ విషయమైనా పిల్లలు పేరెంట్స్ ను చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు టైంకి పనులు చేస్తూ, వాళ్లకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి.
- మొదట్లో పిల్లలు చేయగలిగే పనులు చెప్పాలి. కష్టమైన పనులు చెబితే, వాళ్లు తమ వల్ల కాదని డీలా పడతారు. ఒక్కోసారి పనిచేసే ప్రయత్నం కూడా చేయరు.
- ఇంటిపనుల్లో పిల్లల్ని సాయపడమనడం కొంత వరకు మంచిదే. అలాగని వాళ్లని అదేపనిగా ఒత్తిడి చేయకూడదు.
- అలాగే, పిల్లలు ఏ చిన్న పని చేసినా కూడా మెచ్చుకోవాలి. దాంతో, వాళ్లకి ఏ పని అయినా చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది.
- పిల్లల పనిలో సహాయం అవసరమైతే, వారికి సహాయం అందించండి.
- పిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి... వారు ఆ పనిని పూర్తి చేయగలరని నమ్మకం కలిగించండి
- పిల్లలు పని చేయడానికి ప్రశాంతమైన ... కాన్సన్ ట్రేషన్ కలిగే వాతావరణం ఉండేలా చూడాలి.
- పిల్లలతో మాట్లాడి వారు పనిని వాయిదా వేయడానికి గల కారణాలను తెలుసుకోండి.
పిల్లలు పనిని వాయిదా వేస్తున్నట్లయితే, దాన్ని సరిచేయాల్సిందే.. పిల్లలు పనిని వాయిదా వేయడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం మరియు దానిని పరిష్కరించడానికి కలిసి పనిచేయడం చాలా ముఖ్యం.. లేకపోతే వారి జీవితంపై వర్క్ వాయిదా ప్రభావం పడే అవకాశం ఉంది.