
దోమలు, ఈగలు చూడటానికి చిన్నవే అయినా వాటివల్ల వచ్చే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు. ఎక్కడెక్కడో తిరిగొచ్చి అన్నం, కూరలపై వాలుతుంటాయ్. ఈగలు.. గుయ్యి గుయ్యి మంటూ చెవిలో మోత మోగిస్తూ చిరాకుపెడుతుంటాయ్.వానాకాలం ఏ మాత్రం ఏమరపాటుగా వా ఉన్నా డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు చుట్టుముడతాయి. రకరకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లోంచి దోమలు, ఈగల్ని వెళ్లగొట్టాలి.రసాయన ఉత్పత్తులకు చెక్ పెట్టి ఈగల్ని, దోమల్ని, ఇతర క్రిమికీటకాల్ని ఇంటి నుంచి పారదోలొచ్చు. అదెలాగంటే..
ఈగలు.. దోమలు.. గోల అంతా ఇంతా కాదు.. దోమకాటు ఒళ్లంతా సూది గుచ్చినట్టు ఉంటుంది. అవి తెచ్చిపెట్టే జబ్బులు, జ్వరాలు. వీటి బారినుంచి బయటపడటానికి ఎన్ని రకాల జెట్ కాయిల్స్, లిక్విడ్స్ వాడితే ఇంకో బాధ. వాటి తయారీలో వాడిన రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- నిమ్మకాయ చెక్కల్లో లవంగాలు గుచ్చి దోమలు, ఈగలు తిరిగే చోట ఉంచాలి
- బంతిపూలలోని రెపెల్లెంట్ గుణాలు కూడా దోమలను తరిమేస్తాయి.
- తులసి, పుదీనా, లావెండర్ మొక్కల్ని పెంచితే ఈగలు ఇంటి దరిదాపుల్లో కనపడవు..
- తులసి, లవంగం రసాల్ని నీళ్లలో కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే దోమలు రావు.
- ఒక కప్పు నీళ్లలో కొంచెం పుదీనా రసం వేసి స్ప్రే చేసినా... ఫలితం ఉంటుంది.
- ఈగలు ఎక్కువగా ఉన్నచోట కర్పూరం వెలిగించాలి.
- నీళ్లలో ఒక స్పూన్ పసుపు కలిపి ఇల్లు శుభ్రం చేస్తే ఈగలు, దోమలు రావు