under 19 world cup: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డ్స్ ఇవే..

under 19 world cup: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డ్స్ ఇవే..

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సులతో 175 రన్స్ బాదాడు ఈ చిచ్చరపిడుగు. క్రీస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి బ్యాట్ తో విజృంభించాడు సూర్యవంశీ. సూర్యవంశీ స్పీడ్ కి ఇంగ్లాండ్ బౌలర్లు ఏమాత్రం బ్రేకులు వేయలేకపోయారు.

కేవలం 55 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ.. అతితక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డ్ సాధించాడు.అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన మూడో ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు సూర్యవంశీ. గతంలో మంజోత్ కాల్రా, ఉన్ముక్త్ చంద్ ఈ ఘనత సాధించగా.. వారికంటే తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ప్లేయర్ గా రికార్డ్ సాధించాడు సూర్యవంశీ.

ALSO READ : 175 పరుగులతో రికార్డులు బద్దలు

సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే:

  • అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో అత్యధిక స్కోర్ ( 175 )
  • అండర్ 19 వన్డే చరిత్రలో 100 సిక్సర్లు పూర్తి చేసిన ఫస్ట్ ప్లేయర్ 
  • అత్యంత చిన్న వయసులో అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ
  • అండర్ 19 వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ 
  • ఫైనల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సులు
  • అండర్ 19 వరల్డ్ కప్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు.