పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా, ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన అనౌన్స్ అయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగిన పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని, ఈ సినిమా ప్రేక్షకులకు ఓ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతోందని నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి సినిమా కథ, టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2023లో వచ్చిన ‘ఏజెంట్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా ప్రకటించడం ఫ్యాన్స్‌లో భారీ సందేహాన్ని నింపింది. ఇటీవలే ‘ఓజీ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
►ALSO READ | With Love Review: స్కూల్ డేస్ క్రష్ ఒక మధుర జ్ఞాపకం! అనస్వర రాజన్ 'విత్ లవ్' హిట్టా? ఫట్టా?
హీరోయిన్‌గా ‘ఫౌజీ’ బ్యూటీ ఎంపిక?
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇమ్మాన్వి ఇస్మైల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీపై మేకర్స్ దృష్టి పడినట్లు తెలుస్తోంది.
ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, హీరోయిన్ ఎంపిక విషయంలో తాను జోక్యం చేసుకోనని, కథకు సరిపోయే నటి ఎవరైతే ఉంటారో వారినే ఎంపిక చేయాలని ఆయన సూచించినట్లు టాక్. దీంతో ఇమ్మాన్వి ఇస్మైల్‌ను హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ చేసే దిశగా దర్శకుడు అడుగులు వేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సురేందర్ రెడ్డి హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందువల్ల పవన్ కళ్యాణ్ సరసన ఈ కొత్త హీరోయిన్ కనిపించే అవకాశాలు బలంగా ఉన్నట్లు సమాచారం.
మార్చిలో షూటింగ్–పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!
ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే మార్చి 26న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో వరుసగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపు కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మరిన్ని అధికారిక అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
సురేందర్ రెడ్డి-పవన్ కళ్యాణ్ మూవీ కథ!
హైదరాబాద్ మాఫియా బ్యాక్‌డ్రాప్లో రానున్న ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ అండర్ వరల్డ్ డాన్గా, పోలీస్ అధికారిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సంచారం. అంతేకాదు ఈ సినిమాలో పవన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందట. మునుపెన్నడూ కనపడని సరికొత్త అవతారంలో, సరికొత్త బాడీ లాంగ్వేజ్తో ఆడియన్స్ను అలరించనున్నారట పవన్ కళ్యాణ్.
వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ లేదా అనిరుధ్.. వీరిద్దరిలో ఒకరు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇకపోతే, ఈ సినిమాకు "ఒకడే ఇద్దరు కదా" అనే ఇంట్రెసింగ్ టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021
