టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు దేశవాళీ లీగ్‌లకు సైతం గబ్బర్ గుడ్ బై చెప్పారు. శనివారం సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. ఈ క్రమంలో ధావన్ రిటైర్మెంట్పై అతడి చిన్ననాటి కోచ్ దేవేంద్ర శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఓ నేషనల్ మీడియాతో ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి లైఫ్‌లో సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించబోతున్న శిఖర్ ధావన్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ ప్రయాణంలో అతడికి అంత మంచే జరగాలని ఆకాంక్షించారు.
ధావన్ వెరీ టాలెంటెడ్ ప్లేయరని.. అతడి సత్తా ఏంటో ప్రపంచం చూసిందని కొనియాడారు. ఇక, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ఈ సందర్భంగా ధావన్‌కు దేవేంద్ర శర్మ సూచించారు. క్రికెట్‌కు వీడ్కోలు అనంతరం ఆటతోనే సంబంధం ఉండే కామెంటేటర్ రోల్ ప్లే చేయాలని ఫన్నీగా సూచించారు. ఎప్పుడు చిరు నవ్వుతో ఉండే ధావన్ కు ఈ రోల్ కరెక్ట్ గా సూట్ ఆవుతోందని అన్నారు. ఇక, భారత్ తరుఫున 269 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడిన ధావన్.. 24 సెంచరీలు (వన్డేలలో 17, టెస్ట్‌లలో ఏడు) బాదాడు. తన అద్భుతమైన ఆటతో ఎన్నో మ్యాచుల్లో ధావన్ ఒంటి చేత్తో భారత్ కు విజయాలను అందించాడు.