థర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి

థర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకినా అంత ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. అయితే వారి నుంచి పెద్దలకు వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. పిల్లలకు కరోనా సోకినా వారిలో వ్యాధి లక్షణాలు సాధారణంగానే ఉంటాయని.. ఆస్పత్రుల్లో చేర్చాల్సినంత సీరియస్ గా పరిస్థితి ఉండదని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. అయితే 10 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు.. ఇతర పిల్లల్ని గుంపులుగా కలుస్తుంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.