ఎన్నికల ఖర్చుకోసం ఈటలకు విరాళమిచ్చిన చిన్నారులు

V6 Velugu Posted on Oct 16, 2021

ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చుల కోసం ఈటల రాజేందర్‎కు ఇద్దరు చిన్నారులు విరాళమిచ్చారు. నియోజకవర్గానికి చెందిన ‎వనితారెడ్డి, వీహార్ అనే ఇద్దరు చిన్నారులు 5 వేల 16  రూపాయల విరాళం అందించారు. కిడ్డీ బ్యాంకులో తాము దాచుకున్న సొమ్మును కమలాపూర్ మండలం శంభునిపల్లిలో ఈటలకు అందజేశారు. చిన్నారుల మంచి మనసుకు ఈటల రాజేందర్ థ్యాంక్స్ చెప్పారు.

 

Tagged Telangana, Eatala Rajender, Kamalapur, Huzurabad, Huzurabad By election, kiddy bank

Latest Videos

Subscribe Now

More News