వానా కాలంలో పిల్లల ఆరోగ్యానికి టిప్స్ ఇవే..

వానా కాలంలో పిల్లల ఆరోగ్యానికి టిప్స్ ఇవే..

వానాకాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. కావాలనే  వానలో తడుస్తుంటారు. సాధారణంగా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ. దాంతో జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడతారు. ఈ కాలంలో ఇంట్లోనే కాదు, ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తరచూ డాక్టర్దగ్గరకు తీసుకెళ్లేకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

ఈ కాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి పంచే ఫుడ్‌ ఇవ్వాలి.

తినే పదార్థాల్లో విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి.

ఈ రోజుల్లో పిల్లలు పానీపూరి, మిర్చిబజ్జీల్లాంటివి ఎక్కువ తింటుంటారు. చిరుతిళ్లు బయటవి కాకుండా ఇంట్లో వండి పెట్టడం బెటర్.

స్కూల్‌ నుంచి తడిచి వస్తే, వెంటనే స్నానం చేయించి పొడి బట్టలు వేయాలి.

    పిల్లల గది కూడా చల్లగా లేకుండా పొడిగా, వెచ్చగా ఉండేలా చూడాలి.

ఏవైనా తినేముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోమని చెప్పాలి. లేదంటే చేతుల ద్వారా బ్యాక్టీరియా లోపలకు వెళ్లొచ్చు.

     పిల్లలు ఇంట్లో గచ్చు మీద ఆడుకుంటుంటారు. కానీ వానాకాలంలో గచ్చు చల్లగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కింద ఆడుకోనీయకుండా చూడాలి.

చిన్నపిల్లలైతే పాదాలకు సాక్స్‌ వేయడం మర్చిపోకూడదు. బయటకెళ్తే షూ వేయాలి.

బయటకు పంపేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోటు లేకుండా పంపకూడదు.

వారానికి ఒకసారైనా పిల్లల దుస్తులు, వాళ్లు వాడే వస్తువులు వేడి నీళ్లతో శుభ్రంగా ఉతకాలి.

     ఈ కాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు లాంటి క్రిమికీటకాలు రాకుండా చూసుకోవాలి.