V6 News

Money Managment: పాకెట్ మనీకి ఒక లెక్కుంది.. పిల్లలకుచెప్పాల్సిన పైసల లెక్క ఇదే!

Money Managment:  పాకెట్ మనీకి ఒక లెక్కుంది.. పిల్లలకుచెప్పాల్సిన పైసల లెక్క ఇదే!

పైసలంటే లెక్కే లేదు అని కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటారు. ఆ పిల్లలు కూడా అవసరం ఉన్నవి, లేనివి, అన్నీ కావాలని గొడవ చేసి లెక్కలేకుండా ఖర్చు పెడతారు... పెట్టిస్తారు.పైసలెట్ల ఖర్చు పెట్టాలన్నది చాలాసార్లు పెద్దలకే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్ పిల్లలకు మాత్రం ఎంత అర్ధం అవుతుంది? అయితే ఈ కొన్ని చిట్కాలతో మీ పిల్లలకు పైసలెట్ల ఖర్చు పెట్టాలో నేర్పించండి!

మనీ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పట్నుంచే రావాలి. ఒక రూపాయిని ఏ సమయంలో ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది తెలియాలి. పిల్లలకు ఇది నేర్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. టీనేజ్ వయసుకి రాగానే సొంతంగా బయటికెళ్లి చదవడం ఈతరం వాళ్లకు తప్పనిసరి అయిపోయింది. అందుకే ఐదేళ్ల వయసు నుంచే ఒక్క రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించడానికి కొన్ని పద్ధతులు, ఆటలు ఉన్నాయి.

ఈ ఆటలు ఆడించండి: మనీ మేనేజ్ మెంట్ నేర్పించే ఆటలు చాలా ఉన్నాయి. బయటికి వెళ్లి అదే ఆటలు ఎలాగ ఆడతారు. ఇంట్లో ఆడుకునే చెస్, క్యారంబోర్డు లాంటివి జాగ్రత్తగా ఒక వస్తువును ఎలా దాచిపెట్టుకో వాలి. ఎలా వాడాలో నేర్పిస్తాయి. ఇది ఆలోచనకు సంబందించిన ఆటలు ఇవి కాకుండా అచ్చంగా మనీ మేనేజ్ మెంట్ నేర్పించే ఆటలు పిల్లలకు అలవాటు చేయొచ్చు. మోనోపాలి' ఈ ఆటల్లో అన్నింటికన్నా బెస్ట్ ఆట ఆడుతూ డబ్బులు (అంటే ఆడుకునే నోట్లు) సంపాదించడం. ఆ డబ్బుల ఇంటికి అవసరమైన వస్తువులు కొనడమే ఈ ఆట. ఇందులో వాళ్ల దగ్గర ఉన్న డబ్బునే పిల్లలు జాగ్రత్త గా ఖర్చు పెడుతుంటారు. ఇలాంటి ఆటలు నేర్పిస్తే జీవితంలో కూడా దీనికి ఎంత ఖర్చు పెట్టాలన్న అవగాహన తెచ్చుకుంటారు. పిల్లలతో కలిసిపోయి పెద్దలూ ఈ ఆట ఆడితే వాళ్లకు ఇంకొన్ని మెళకువలు నేర్పవచ్చు.

ఎప్పుడైనా ఫోన్ చేతికిస్తే: ఇప్పుడు  స్మార్ట్​ ఫోన్​ తెలియని ప్రపంచం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలను కూడా ఫోన్లు బాగా ఆకర్షిస్తాయి. అవి అందుకొని రైమ్స్ చూడాలని, గేమ్స్​ ఆడాలని గొడవ చేస్తారు.  అలాంటప్పుడే ఆన్​ లైన్​ లో ఉన్న ఫైనాన్స్ గేమ్స్​  పిల్లలతో ఆడించొచ్చు. ఇవి వాళ్ల మేథమెటిక్స్ నేర్పించడంతో పాటు మనీ మేనేజ్ మెంట్ కూడా నేర్పిస్తాయి. కొంత బడ్జెట్ ఇచ్చి ఆ డబ్బును దీనికెలా ఖర్చు చేయొచ్చో లెక్క తేల్చమని అడుగుతాయి. ఫైనాన్స్​ యాప్స్​, ప్రయారిటీలను ఎంచుకుంటూ బడ్జెట్ లోపలే ఖర్చు చేయడం ఈ ఆటలను చూసి నేర్చుకోవచ్చు. పిల్లలు గొడవ చేస్తున్నారని ఎప్పుడైనా వాళ్ల చేతికి ఫోన్ ఇస్తే ఈ ఆటలు ఆడమని చెప్పండి.

►ALSO READ | తెలంగాణ చరిత్ర : హైదరాబాద్సిటీలో బేగం బిల్డింగ్.. ఎంత మందికి తెలుసు దీని విశిష్ఠత..!

పాకెట్ మనీకి ఒక లెక్కుంది: పిల్లలు అడిగారని ఎంతంటే అంత పాకెట్ మనీ ఇస్తే అది వాళ్లను మనీ మేనేజ్ మెంట్ లో వీక్ చేస్తుంది. ఒక్కోసారి నిజంగానే మీరిచ్చే పాకెట్ మనీ సరిపోకపోవచ్చు. అందరికీ వచ్చినట్టే పిల్లలకూ కొన్ని అత్యవసర ఖర్చులు రావొచ్చు. దానికి పరిష్కారం కూడా వాళ్లనే వెతుక్కోమని చెప్పండి. కష్టపడి ఏదైనా పనిచేసి ఆ కొన్ని డబ్బులు సంపాదించుకోమని చెప్పండి. ఇంట్లోనే ఉన్న చిన్న పనులు చేస్తే ఎక్స్ట్రా పాకెట్ మనీ ఇవ్వండి. ఇది వాళ్లలో డబ్బు ఊరికే రాదు" అన్న ఆలోచనను తీసుకొస్తుంది.

తప్పు చేస్తే తిట్టొద్దు: నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా?" అనే మాట పిల్లల ముందు ఎప్పుడూ చెప్పొద్దు. కాకపోతే విషయం మాత్రం వాళ్లకు తెలియాలి వాళ్లతో ప్రశాం తంగా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని పాజిటివ్​గా చెప్పొచ్చు. పిల్లలు దాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటా రు. అరిచి చెప్తే మాత్రం కచ్చితంగా మీరు చెప్పిన విషయం అర్థం కాకపోగా, చిరాకు తెచ్చుకుంటారు. ఒకవేళ అనవసర ఖర్చులు చేసి మీకు దొరికిపోయి.. నా మందలించకుండా, కూర్చోబెట్టి వాళ్లు చేసిన తప్పేంటో అర్ధమయ్యేలా చెప్పండి..

పొదుపు అవసరం:మనీ మేనేజ్ మెంట్ ను పిల్లలకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే పొదుపు నేర్పించాలి. ఐదేళ్ల వయసున్న పిల్లలు సైకిల్ కావాలని అడిగారనుకుందాం. దానికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చవుతుందనుకుంటే నెలకు ఐదొందల రూపాయల చొప్పున ఆరు నెలలు ఇస్తూ సేవింగ్స్ చేయమని చెప్పండి. ఆరో నెల సైకిల్ కొనిపెట్టండి. ఏ వస్తువైనా ఊరికి రాదని, డబ్బులు జాగ్రత్తగా కూడబెడితేనే భవిష్యత్ ఉంటుందని పిల్లలకు ఇలాంటి విషయాల వల్లే అర్ధ మవుతుంది.

ఇది తెలుసా?

పాశ్చాత్య దేశాల్లో సెలవుల్లో పిల్లలను చిన్న చిన్న పనులకు పంపిస్తారు తల్లిదండ్రులు.  కాలనీలో ఉండే బేకరీలో ప్యాకింగ్ చేయడం, అప్లికేషన్లు నింపి పెట్టడం లాంటి పనులు చేసి సంపాదిస్తారు పిల్లలు. దీంతో వాళ్లకు చిన్న వయసులోనే లైఫ్ స్కిల్స్ తో పాటు డబ్బు సంపాదించడం గురించి కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్లు ఎంతో ఇష్టంగా అడిగిన వస్తువులను వాళ్ల డబ్బుతోనే కొనిపెట్టొచ్చు. మన దగ్గర కూడా వేసవి కాలంలో పిల్లలు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి సంపాదించడం చూస్తుంటాం. కాకపోతే ఇలాంటివి వాళ్లు ఆడుతూ పాడుతూ చేసే పనులైతేనే చెయ్యనివ్వండి.​