న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్ కు సాయం చేసినట్లు చైనా ఒప్పుకుంది. యుద్ధ క్షేత్రంలో టెక్నికల్ సపోర్టు అందించామని తెలిపింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్ సీఎంపీ) వెల్లడించింది. ఎస్ సీఎంపీ నివేదిక ప్రకారం పాకిస్తానీ ఆపరేషన్లలో పాల్గొన్నామని ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) తెలిపింది.
ఏవీఐసీ చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు చెందిన ఇంజినీర్ ఝాంగ్ హెంగ్తో పాటు మరికొంత మంది ఇంజినీర్లు పాక్కు కీలకమైన టెక్నికల్ సపోర్టు అందజేశారు. ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్ కు చైనా యుద్ధ సహాయం అందించిందని భారత్ గతంలోనే ఆరోపించింది. అయితే, చైనా మాత్రం తాజాగా ఈ ఆరోపణలు నిజమేనని అంగీకరించినట్లు సమాచారం.
