రష్యా మెరుపు దాడులతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయలు స్వదేశాలకు బయలుదేరుతున్నారు.తమ వారి కోసం ఆయా దేశాలు ప్రత్యేక విమానాల ద్వారా చేరవేస్తున్నాయి. తాజాగా.. చైనా తన పౌరులను ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన చైనీస్ విద్యార్థులు, ఆ దేశ పౌరులతో కూడిన చార్టర్డ్ విమానం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హాంగ్‌జౌ చేరింది. 3,000 కంటే ఎక్కువ మంది చైనా పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు తరలించింది. అక్కడ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానాల ద్వారా చేరవేస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
