చర్చల ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్ లకు చైనా సలహా ఇచ్చింది. దీనికి సంబంధించి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. చర్చల ద్వారానే రష్యా, ఉక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన ఆయన.. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఇప్పటికే భీకర దాడులకు రష్యా పాల్పడుతోంటే..ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా హోరాహోరీగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సిద్ధమంటూ ప్రకటన చేశారు. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులపై పుతిన్‌తో జిన్ పింగ్ చర్చించినట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం..
