
సెసన్-సెవిగ్నే (ఫ్రాన్స్): ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి నిరాశపర్చింది. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో ఆరోసీడ్ సాత్విక్–చిరాగ్ 18–21, 20–22తో ముహ్మద్ రియాన్ అర్డియాంటో–రహమత్ హిదాయత్ (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆయుష్ షెట్టి 19–21, 19–21తో కొకి వాటనాబే (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 11–21, 21–13, 21–16తో కరుపతేవాన్ లెట్షానా (థాయ్‌లాండ్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. కానీ, అన్మోల్ ఖర్బ్ 15–21, 9–21తో అన్ సీ యంగ్ (కొరియా) చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 15–21, 11–21తో హన్ యు (చైనా) చేతిలో ఓడారు.