మెగాస్టార్ మరో మూవీకి ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ మరో మూవీకి  ముహూర్తం ఫిక్స్

ఈ సంక్రాంతికి  ‘మన శంకర వరప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌ గారు’ చిత్రంతో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి ఈ సక్సెస్ జోష్‌‌‌‌‌‌‌‌లోనే  నెక్స్ట్ ప్రాజెక్టుపై  ఫోకస్ పెట్టారు. ఆయన తర్వాతి సినిమాను  దర్శకుడు బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఓ క్రేజీ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ మూవీని అనౌన్స్ చేయగా తాజాగా రెగ్యులర్ షూట్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారట. చిరంజీవి కెరీర్‌‌‌‌‌‌‌‌లో 158వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని  జనవరి 25న పూజా కార్యక్రమాలతో మొదలుపెడుతున్నట్టు తెలుస్తోంది.

ఆల్రెడీ  ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఇతర నటీనటులు ఎంపికలో మూవీ టీమ్ బిజీగా ఉందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌‌‌‌‌‌‌‌కే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు.  ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కనున్న ఈ  చిత్రంలో చిరంజీవి మరోసారి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లోనూ చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అవగా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.