నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు వెళ్లొచ్చు : గుత్తా సుఖేందర్ రెడ్డి 

నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు వెళ్లొచ్చు : గుత్తా సుఖేందర్ రెడ్డి 
  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

చిట్యాల, వెలుగు:  ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  చిట్యాల పట్టణంలోని మున్సిపాలిటీ చైర్‌‌ పర్సన్‌గా పందిరి గీత, వైస్‌ చైర్‌‌పర్సన్‌గా శ్రీలక్ష్మీతో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చిట్యాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ఈ పదవులను నిబద్ధతతో నిర్వహిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చన్నారు.

ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. అందరూ సమన్వయంతో పని చేసి చిట్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌‌పర్సన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.