కొడిమ్యాల, వెలుగు: పాలనా సౌలభ్యం కోసం కొత్త జీపీ బిల్డింగ్‌లను నిర్మించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్య పేట,కోనాపూర్, చింతల్ల పల్లి గ్రామాల్లో కొత్త పంచాయతీ బిల్డింగ్ లను ప్రారంభించారు. అనంతరం నమిలికొండ, పుద్దూరు, తిర్మలాపూర్, సురంపేట గ్రామాల్లో మహిళా స్వశక్తి భవనాలను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు పీట్ల అనూష శేఖర్, తైదల అంజయ్య, గడ్డం జీవన్ రెడ్డి, కడారి మల్లేశం, లీడర్లు రాజనర్సింగ రావు, ముత్యం శంకర్ పాల్గొన్నారు.
మల్యాల: మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో పూర్తయిన పోచంపల్లి కవిత–- బాలరాజుకు చెందిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. అనంతరం మానాల గ్రామంలో సుతారి మల్లవ్వకు చెందిన ఇందిరమ్మ ఇంటిని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
