
ఇరవై ఏళ్లుగా కొరియోగ్రాఫర్‌గా కొనసాగు తున్న శివ తుర్లపాటి... ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యా డు. అంజలి ఫిమేల్ లీడ్‌గా కోన వెంకట్ సమ ర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలైంది. సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి శివ మాట్లాడుతూ ‘ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్ చేయాలనే తీసిన మూవీ ఇది. కోన వెంకట్ గారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించే వారికి చాలా బాగా నచ్చుతోంది. సెకండాఫ్‌లో వచ్చే సునీల్, సత్య కామెడీ ఎక్స్‌ట్రార్డినరీ అని మెచ్చుకుంటున్నారు.
యుఎస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని రివ్యూల్లో నెగిటివ్‌గా రాశారు. రివ్యూలను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. వాళ్లు చెప్పిన లాజిక్కులన్నిటికీ సమాధానం చెబుతూ పోతే, మూడు గంటల నిడివి వస్తుంది. వాటన్నిటికీ ‘గీతాంజలి 3’లో సమాధానం దొరుకుతుంది. నేను మాత్రం డైరెక్టర్‌గా శాటిస్‌ఫై అయ్యా. నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేయడానికి హెల్ప్ అయ్యింది’ అని చెప్పాడు.