చౌటుప్పల్: OG సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట.. లక్షా 30 వేలకు దక్కించుకున్న పవన్ వీరాభిమాని

చౌటుప్పల్: OG సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట.. లక్షా 30 వేలకు దక్కించుకున్న పవన్ వీరాభిమాని

యాదాద్రి భువనగిరి జిల్లా: పవన్‌ కల్యాణ్‌ OG సినిమా బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్‌కు చౌటుప్పల్ టౌన్లో రికార్డ్‌ ధర పలికింది. పవన్‌ కల్యాణ్‌ OG సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట నిర్వహించగా, లక్షా 29 వేల 999 రూపాయలకు పవర్ వీరాభిమాని దక్కించుకున్నాడు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో వేలంలో టికెట్‌ దక్కించుకున్న పవన్‌ వీరాభిమాని పేరు ఆముదాల పరమేష్‌. టికెట్‌ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తానని పరమేష్‌ చెప్పాడు. సినిమా టికెట్లను వేలం పాట పాడే కొత్త సంస్కృతి OG సినిమాతోనే మొదలైంది.

మొన్నా మధ్య ‘ఎక్స్’ వేదికగా కూడా పవన్ కల్యాణ్ అభిమానులు OG ఫస్ట్ టికెట్పై వేలం పాట నిర్వహించగా, ఏకంగా పవన్ ఫ్యాన్ క్లబ్ పేజ్ 5 లక్షలకు పాడటం గమనార్హం. పవన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు.. ఆయన అభిమానులు 'X’ స్పేస్ వేదికగా ఈ ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు ఈ వేలంలో పాల్గొని బిడ్డింగ్ తీవ్ర స్థాయిలో కొనసాగించారు. చివరికి నార్త్ అమెరికా ఫ్యాన్ క్లబ్ ఈ వేలంలో OG టికెట్ను రూ.5 లక్షలకు గెలుచుకుంది. ఈ వేలం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఇక.. OG ట్రైలర్ చెప్పిన టైంకు రిలీజ్ చేయకపోవడంతో పవన్ అభిమానులు అసహనంతో రగిలిపోతున్నారు. OG Concert పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే OG ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నారు.