
మెదక్/పాపన్నపేట, వెలుగు : మెదక్ కెథడ్రల్చర్చిలో ఆదివారం క్రిస్మస్సెలబ్రేషన్స్గ్రాండ్గా జరిగాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాల నుంచే కాక, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్‌చేశారు. తెల్లవారుజామున 4.30 గంటలకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ ఏసీ.సాల్మన్రాజ్ఆధ్వర్యంలో మార్నింగ్సర్వీస్నిర్వహించి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. భక్తులకు దైవసందేశాన్ని అందించారు. ప్రజలు పెద్దఎత్తున తరలి రావడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు చర్చి ప్రాంగణం భక్తజన సందోహంగా మారింది. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రజా క్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మెదక్‌జిల్లా ఏడుపాయల వన దుర్గా భవాని మాతను కుటుంబీకులతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించి ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్జాతీయ స్థాయిలో పార్టీని నెలకొల్పారని మంత్రి అన్నారు.